తెలంగాణ

telangana

ETV Bharat / state

'మినీ స్టేడియం అందని ద్రాక్షగా మిగిలింది' - MINI STADUIM BJP PARISHILANA

హుస్నాబాద్ పట్టణంలో శంకుస్థాపన చేసినా... మినీ స్టేడియం క్రీడాకారులకు అందని ద్రాక్షగా మారిందని భాజపా పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ ఆరోపించారు. 2018లో ప్రారంభించిన పనులు ఇంతవరకు పూర్తికాలేదన్నారు.

mini-stadium-remains-grapevine-at-husanabad
'మినీ స్టేడియం అందని ద్రాక్షగా మిగిలింది'

By

Published : Nov 30, 2019, 11:44 PM IST

హుస్నాబాద్ పట్టణంలోని మినీస్టేడియాన్ని ఈరోజు భాజపా పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్​తో పాటు పలువురు నేతలు సందర్శించారు. పట్టణ ప్రాంత ప్రజలు ఉదయం భయం భయంగా రోడ్డుపైనే మార్నింగ్ వాక్​కి వెళ్తున్నారని, మైదానం లేక క్రీడాకారులు నగరాల బాట పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే చాడ వెంకట్​రెడ్డి హయాంలో భవనాలకు రూ.99 లక్షలు మంజూరు కాగా గోడలు కట్టి వదిలేసారని అన్నారు.

2018 సంవత్సరంలో ఎమ్మెల్యే సతీష్ మిగులు పనులకు రూ.కోటి మంజూరు చేసినా పనులు ఇంకా పూర్తికాలేదని ఆరోపించారు. మినీ స్టేడియం హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కలగానే మిగిలిపోయిందన్నారు. మంత్రి, ఎమ్మెల్యే గారు స్పందించి మినీ స్టేడియాన్ని వెంటనే పూర్తి చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు.

'మినీ స్టేడియం అందని ద్రాక్షగా మిగిలింది'

ఇదీ చూడండి : 'పోలీసులు మానవీయ కోణంలో స్పందించాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details