జీతాలు పెంచండి.. వేతన బకాయిలు ఇవ్వండి
వేతనాలు పెంచాలని.. బకాయిలో ఉన్న జీతాలు ఇవ్వాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల ఆశావర్కర్లు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఆశావర్కర్లకు ఏపీలో అమలవుతున్న విధానాలు ఇక్కడ కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జీతాలు పెంచండి.. వేతన బకాయిలు ఇవ్వండి
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల ఆశావర్కర్లు వేతనాలు పెంచాలంటూ.. నిరాహార దీక్షలు చేపట్టారు. కనీస వేతనం 10వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ నేత భాస్కర్ కోరారు. ఏపీలో కనీస వేతనం 10వేలు ఇస్తున్నారని.. ఆ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.