బాబా సన్నిధిలో హరీశ్ రావు - puja
సిద్దిపేట గ్రామం షిర్డీ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి పర్వదినాన సాయిబాబా పల్లకి సేవలో పాల్గొన్నారు.

హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే హరీశ్ రావు పర్యటించారు. వసంత పంచమి పురస్కరించుకుని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం ఆలయ నిర్వాహకులు మేళతాళాలతో స్వాగతం పలికారు. యాగంలో పాల్గొని బాబా పల్లకి సేవ చేశారు.