తెలంగాణ

telangana

ETV Bharat / state

అడవుల్లో డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ నాటే కార్యక్రమం - సిద్దిపేట జిల్లాలో డ్రోన్ ద్వారా విత్తనాలు నాటిన మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట జిల్లాలోని అడవుల్లో పచ్చదనం పెంచేందుకు డ్రోన్లను రంగంలోకి దింపారు. అడవిలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య పాల్గొన్నారు.

planting seeds through drone at siddipet
అడవుల్లో డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ నాటే కార్యక్రమం

By

Published : Aug 1, 2020, 7:43 PM IST

సిద్దిపేట జిల్లాలోని అడవుల్లో డ్రోన్ ద్వారా విత్తన బంతులను చల్లే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని మంత్రి హరీశ్ రావు, పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య కలిసి ప్రారంభించారు. అడవుల్లో మనుషులు వెళ్లలేని చోటకు డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ ను తీసుకెళ్లి నాటుతున్నట్లు ఆయన వివరించారు.

సీడ్ బాల్స్ ద్వారా చెట్లను పెంచడం మంచి ఆలోచన అని వనజీవి రామయ్య అన్నారు. లాటరీ టికెట్ కొంటే లాభం రాకపోవచ్చు గానీ మొక్కను నాటితే పండ్లు, నీడ, గాలి ద్వారా ఎంతో లాభం కలుగుతుందన్నారు. భవిష్యత్తులో మానవ మనుగడ కొనసాగాలంటే.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా మార్చాలని రామయ్య తెలిపారు.

ప్రకృతికి సేవ చేస్తే మనుషులకు చేసినట్లేనని.. అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కోటికిపైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్యను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సీడ్ బాల్స్ తో కోతులకు ఆహారం ఇచ్చే చెట్లకు అధిక ప్రాధాన్యమిచ్చిన్నట్లు మంత్రి పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details