సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రేపు జరగబోయే ఎన్నికల భద్రత ఏర్పాట్లను సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీలైన గజ్వేల్, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్‌లో ఎన్నికలకు సంబంధించి భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 800 మంది ప్రత్యేక పోలీసు బలగాలను విధుల్లో ఉంచామని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ
రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మున్సిపాలిటీ ఎన్నికల భద్రత ఏర్పాట్లను సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. హుస్నాబాద్‌లోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ