రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని... మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పంట కొనుగోలుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
పంట కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశాం: హరీశ్ రావు - కరోనా వైరస్ వార్తలు
పంట కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. టోకెన్ల విధానంలో రైతులు పంట కొనుగోలు కేంద్రాలకు రావాలని సూచించారు. . కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.
harish rao
టోకెన్ల వారీగా కొనుగోలు కేంద్రాలకు రావాలని... ఒక్కసారిగా వచ్చి ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్న మంత్రి హరీశ్ రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.