స్నేహితునితో కలిసి వచ్చిన ఓ సాప్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన పటాన్చెరు సమీపంలోని డిఫెన్స్ కాలనీలో కలకలం రేపింది. స్థానికంగా నివాసముండే శివాని ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. నిన్న హైదరాబాద్ వెళ్లి తిరిగి రాలేదు. ఆమె తల్లిదండ్రులు కాలనీలో ఎక్కడ వెతికినా కనిపించలేదు. చివరకు కాలనీలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో స్నేహితుడి ద్విచక్ర వాహనంపై దింపి వెళ్లినట్లు నిక్షిప్తమైంది. తన కూతురు ఎక్కడికి వెళ్లిందో అని తండ్రి భయాందోళనతో పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
సాప్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యం...భయాందోళనలో కుటుంబం
స్నేహితునితో కలిసి వచ్చిన ఓ సాప్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన పటాన్చెరులో కలకలం రేపింది. భయాందోళనతో ఉద్యోగిని తండ్రి పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేశారు.
సాప్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యం...భయాందోళనలో కుటుంబం
TAGGED:
software employee missing