తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం.. అరకొర పనులకే బిల్లులు

గుత్తేదారులు పనిచేయకున్నా... అధికారులు డబ్బులు ఇచ్చేస్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే తప్పంతా మాదే.. ఇప్పుడు సరిదిద్దుతామంటున్నారు. తమ శాఖలో జరుగుతున్న పనులను పర్యవేక్షించని అధికారులు.. దానిని గుత్తేదారుల నిర్లక్ష్యంగా చిత్రికరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా.... సంగారెడ్డి జిల్లాలోని చెర్లగొపులారం గ్రామస్థులు ఏడాదిగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

bill

By

Published : Jul 25, 2019, 5:47 AM IST

అధికారుల నిర్లక్ష్యం.. అరకొర పనులకే బిల్లులు

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని చెర్లగొపులారం గ్రామంలో చివర ఉన్న కొండపై పడ్డ వర్షపు నీటిని... చెరువులోకి మళ్లించేందుకు అధికారులు కట్టుకాలువ నిర్మాణం చేపట్టారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా టెండర్లు పిలిచారు. 2016లో రూ.36 లక్షలతో కట్టు కాలువ నిర్మాణాన్ని కాంట్రాక్టర్‌ ప్రారంభించాడు. అందులో నిర్మాణాత్మక జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పలు సమస్యలు తలెత్తాయి. నీళ్లు చెరువులోకి వెళ్లకపోగా... గ్రామం నడిబొడ్డున నిలిచిపోతున్నాయి. కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి.... గ్రామంలో పాములు, దోమలు వస్తున్నాయి.

చెప్పినా వినిపించుకోలేదు!

తమ గ్రామంలో అంతకు ముందే మట్టి కాలువ ఉండేదని.. దీని ద్వారా వర్షపు నీరు నేరుగా చెరువులోకి వెళ్లి.. తద్వారా తమ పొలాల్లోకి వచ్చేవని గ్రామస్థులు చెబుతున్నారు. పనులు ప్రారంభమైనప్పుడే లోతు విషయంలో సలహా ఇచ్చినప్పటికీ... గుత్తేదారుడు వినిపించుకోలేదని వాపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పరిష్కరించడంలో కాలయాపన చేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణాత్మక లోపంతోనే సమస్య

గ్రామంలో నిర్మించిన కట్టుకాలువలో నిర్మాణాత్మక లోపం కారణంగా సమస్య తలెత్తిందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. గుత్తేదారుడు తాము చెప్పిన విధంగా నిర్మాణం చేపట్టకపోవడం వల్లే సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. త్వరలోనే విచారణ చేసి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పనులు పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఉస్మానియా ఆసుపత్రి సురక్షితమేనా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details