తెలంగాణ

telangana

ETV Bharat / state

'కర్షకుల కష్టాలను దూరం చేసిన ఘనత కేసీఆర్​దే' - maanikrao praises the cm kcr

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో వివిధ గ్రామాలకు చెందిన 152 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్​రావు పంపిణీ చేశారు.

పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే

By

Published : Oct 29, 2019, 9:31 PM IST

భూ సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్న కేసీఆర్ సర్కారును రైతులు ఆశీర్వదించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్​రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో వివిధ గ్రామాలకు చెందిన 152 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. నకిలీలకు తావులేకుండా బార్​ కోడ్ విధానంతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు బీమా సౌకర్యం కల్పించి కర్షకులకు కష్టాలను దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్​కు దక్కుతుందన్నారు.

రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details