సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో ఓ బాల్య వివాహాన్ని బాలల సంరక్షణ అధికారులు అడ్డుకున్నారు. బాలికను జిల్లా సఖి కేంద్రానికి తరలించారు. పటాన్‌చెరు మండలం రామేశ్వరంబండలోని ఓ కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికను హైదరాబాద్కు చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారనే సమాచారంతో వెంటనే అప్రమత్తమైనట్లు అధికారులు తెలిపారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో 14 ఏళ్ల బాలికకుపెళ్లి జరుపుతుండగాబాలల సంరక్షణ అధికారులు అడ్డుకున్నారు. బాలికను సఖి కేంద్రానికి తరలించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
బాల్య వివాహాలు అడ్డుకున్న అధికారులు, సంగారెడ్డి జిల్లా వార్తలు
జిల్లా బాలల సంరక్షణ క్షేత్రస్థాయి సిబ్బంది శ్రవణ్ కుమార్, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు గీత, సీసీఎస్ సీఐ భూపతి కలిసి బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.