ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రచారతార విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. 'మోదీ రైతులకు ఏడాదికి కేవలం రూ.6 వేలు ఇస్తానన్నారు... అంటే రోజుకు రూ.17 మాత్రమే' అని మండిపడ్డారు. రైతులంటే మోదీకి గిట్టదంటూ రాములమ్మ ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను కేవసం మూడు రోజుల్లోనే నెరవేర్చారని గుర్తు చేశారు. ఒకే దఫాలో రైతులందరికీ రుణమాఫీ చేశారన్నారు.
మోదీకి రైతులంటే అస్సలు గిట్టదు: రాములమ్మ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రైతుల కష్టాలు తీరుతాయని ఆ పార్టీ ప్రచారతార విజయశాంతి అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేస్తానన్నారని వెల్లడించారు.
మోదీకి రైతులంటే గిట్టదు: విజయశాంతి