తెలంగాణ

telangana

ETV Bharat / state

సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటిన శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్.. - హైదరాబాద్ తాజా వార్తలు

Sloka International School: రంగారెడ్డి జిల్లాలోని శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటింది. తమ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన గ్రేడ్‌లతో ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు.

శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్
శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్

By

Published : Jul 24, 2022, 6:34 PM IST

Sloka International School: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం మన్నెగూడలోని శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటింది. తమ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన గ్రేడ్‌లతో ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. పొనుగోటి శ్రేష్ఠ 97% , తట్టా అలేఖ్య 96.4%, యరమల జ్యోత్స్న 96.47శాతంతో అన్ని సబ్జెక్టుల్లో ఏ1 గ్రేడ్‌లు సాధించారని చెప్పారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు.

ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్ఛం, శాలువాతో ప్రిన్సిపాల్ విశ్వనాథ్ రెడ్డి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులకు చదువుతోపాటు మిగతా విషయాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అందుకనుగుణంగా పాఠశాలలో కనీస చట్టాలపై, మహిళల హక్కులపై వారికి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. పిల్లల శారీరక, మానసిక దృఢత్వం కోసం కరాటే, యోగాల్లో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.

సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటిన శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్

ABOUT THE AUTHOR

...view details