రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం శేరిగూడ బద్రాయపల్లి ప్రవేశం నుంచే పచ్చని వాతావరణంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ఎలాంటి వనరులు లేకపోయినా... అభివృద్ధిలో మాత్రం నూరు శాతం ఫలితాలు సాధించింది. హరిత, మద్యపాన నిషేధం గ్రామంగా విదేశీయుల ప్రశంసలూ అందుకుటోంది. ఇతర గ్రామాలకూ ఆదర్శంగా నిలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమానికి ముందే... శేరిగూడ బద్రాయపల్లిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు. హరితహారంలో భాగంగా... మరో 40 వేల మొక్కలు నాటి ఊరుని పచ్చగా మార్చారు. తడి, పొడి చెత్త వేరు చేసి... ట్రాక్టర్ ఏర్పాటు చేసుకొని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామ శివారులోని కొండలపై ఉన్న అమ్మవార్ల ఆలయాల చుట్టూ చెట్లు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారు.