రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలోని గండిమైసమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై ఓ టిప్పర్ లారీ అగ్నికి ఆహుతైంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన డ్రైవర్ దిగిపోవడం వల్ల ప్రాణాపాయం తప్పంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేసినప్పటికీ లారీ పూర్తిగా కాలిపోయింది. కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అబ్దుల్లాపూర్ సమీపంలో నడిరోడ్డుపై లారీ దగ్ధం
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ఓ లారీ అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు గల కారణాలు తెలియలేదు.
అబ్దుల్లాపూర్ సమీపంలో నడిరోడ్డుపై లారీ దగ్ధం