రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పునరుద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తెదేపా మండల అధ్యక్షులు పొట్టి రాములు, 500 మంది కార్యకర్తలతో కమలం పార్టీలో చేరిన సందర్భంగా కండువా కప్పి ఆహ్వానించారు. ఎంతో మంది బలిదానంతో సాధించిన తెలంగాణలో సెప్టెంబర్ విమోచన దినోత్సవం జరపకుండా సీఎం కేసీఆర్ మజ్లిస్‌కు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించి... రాబోయే రోజుల్లో భాజపా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
'రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా' - భాజపాలో చేరికలు
సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా మజ్లిస్‌కు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని పునరుద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తెదేపా మండల అధ్యక్షుడితో పాటు 500 మంది కార్యకర్తలను భాజపాలోకి కండువా కప్పి ఆహ్వానించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు