తెలంగాణ

telangana

ETV Bharat / state

'అక్షయ తృతీయ అంటే పేదలకు అన్నం పెట్టడం' - AKSHAYA TRITHIYA

అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం కాదని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు హితువు పలికారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడమే నిజమైన అక్షయ తృతీయ అని తెలిపారు.

అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలి : రంగరాజన్

By

Published : May 7, 2019, 3:06 PM IST

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇవాళ రోహిణి నక్షత్రం కావడం వల్ల ఆలయానికి భక్తులు పోటెత్తారు. అక్షయ తృతీయ రోజు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని, గోశాలలో గోవులకు నైవేద్యంతో పాటు పేద బాలికలకు ఒక గ్రాము బంగారం, నిండుగా ఉన్న నీటి కుండను ఇవ్వాల్సిన రోజని ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ వివరించారు. బంగారు దుకాణాల యాజమానులు అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అదృష్టమని, అక్షయ తృతీయకు బంగారానికి ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు స్పష్టం చేశారు.

యాజమానులు అక్షయ తృతీయకు బంగారానికి ముడిపెట్టవద్దు : రంగరాజన్

ABOUT THE AUTHOR

...view details