రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మానస హిల్స్‌లోని క్వారీ గుంతలో పడి ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. సరదాగా ఈతకు వచ్చిన నలుగురు మిత్రులు క్వారీ గుంతకు వచ్చారు. ఈత కొడుతూ నదీమ్ అనే విద్యార్థి క్వారీ గుంతలో మునిగిపోయాడు. మునిగిపోతున్న నదీమ్‌ను అతని మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లలో మృతదేహం కోసం గాలిస్తున్నారు. నదీమ్ మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈతకని వెళ్లి.. అనంతలోకాలకు..
సరదాగా స్నేహితులతో ఈతకు వెళ్లి క్వారీ గుంతలో మునిగి ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్‌లోని మానసహిల్స్‌లో చోటుచేసుకుంది. మృతుని తల్లిదండ్రులు అతని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈతకని వెళ్లి.. అనంతలోకాలకు..