తెలంగాణ

telangana

ETV Bharat / state

'నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడలు దోహదపడతాయి'

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జూనియర్​ కళాశాల మైదానంలో వాలీబాల్​ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ బహుమతులు అందజేశారు.

volley ball games in rajanna siricilla district
'నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడలు దోహదపడతాయి'

By

Published : Dec 26, 2019, 10:39 PM IST

గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఫిట్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని అన్ని మండలాల నుంచి 28 జట్లు పాల్గొన్నాయి. వీటిలో వీర్నపల్లి మండల జట్టు ప్రథమ బహుమతి పొందగా, సిరిసిల్లకు చెందిన జట్టు ద్వితీయ బహుమతి గెలుచుకుంది.

ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నేలకొండ అరుణతో కలిసి రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుమతులను అందజేశారు. అంతకుముందు గురుకుల పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

'నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడలు దోహదపడతాయి'

ఇవీ చూడండి: పౌరసత్వ బిల్లుకు తెరాస వ్యతిరేకం: హోం మంత్రి

ABOUT THE AUTHOR

...view details