సిరిసిల్ల నియోజకవర్గంలో హరితహారంలో భాగంగా విత్తన బంతులు విసరడానికి డ్రోన్‌ను వినియోగిస్తున్నారు. వీర్నపల్లి అడవుల్లో పండ్ల తోటలు పెంచాలని ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా 15వేల విత్తన బంతులు తయారు చేసి... అవి విసరడానికి డ్రోన్‌ను వినియోగిస్తున్నారు.
రావి విత్తనాలతో కూడిన బంతులు 4వేలు, జువ్వికి సంబంధించి 4వేల, సీతాఫలానికి సంబంధించి 1,000విత్తన బంతులతో పాటు కానుగ, మర్రి విత్తనాల బంతులు తయారు చేశారు. అడవుల్లో డ్రోన్ ద్వారా విసిరే ప్రక్రియను అటవీశాఖ అధికారులు ప్రారంభించారు.