రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా 9వ అదనపు జిల్లా స్పెషన్స్ న్యాయమూర్తి అంగడి జయరాజ్ తన కుమార్తెలను సిరిసిల్లలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ఇటీవలె మంథని నుంచి బదిలీపై వచ్చిన ఆయన పదో తరగతి చదువుతున్న జనహిత, 8వ తరగతి చదువుతున్న సంఘహితను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలోనే సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉంటారని, పూర్తి వివరాలు సేకరించాకే నమ్మకంతో తమ పిల్లలను చేర్పించానని చెప్పారు.
ఇద్దరు బిడ్డలను సర్కార్ బడిలో చేర్పించిన న్యాయమూర్తి
ఈ కాలంలో కూలీ అయినా, అటెండరైనా తమ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకే పంపించాలని అనుకుంటారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా 9వ అదనపు సెషన్స్ న్యాయమూర్తి తమ కుమార్తెలను జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చేర్పించారు. చదువుకు పాఠశాలతో సంబంధం లేదని చాటి చెప్పారు.
కుమార్తెలను బడిలో చేరుస్తున్న న్యాయమూర్తి
ఇవీ చూడండి: బౌద్ధ గురువు దలైలామా హత్యకు ఉగ్ర కుట్ర