కరోనా బాధితులంటే కనీస మానవత్వం చూపించని కాలంలో.. వైరస్‌తో మృతి చెందిన ఓ వ్యక్తికి జడ్పీటీసీ సభ్యురాలు ధైర్యంగా ముందుకొచ్చి అంత్యక్రియలు జరిపారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో ఇది జరిగింది.
మానవత్వం చాటుకున్న జడ్పీటీసీ సభ్యురాలు
కరోనా.. మానవత్వాన్ని మంట కలుపుతోంది. బంధు మిత్రులు, గ్రామస్థులంతా.. మృతదేహం దగ్గరకు రావడానికే జంకుతున్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో ఇలాంటి పరిస్థితుల్లోనే..జడ్పీటీసీ సభ్యురాలు ధైర్యంగా ముందుకొచ్చి కొవిడ్ రోగి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు.
మద్దిరాల గ్రామానికి చెందిన కోరాండ్ల ప్రతాప్.. కొవిడ్ బారిన పడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు సైతం మహమ్మారి బారినపడి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. బంధుమిత్రులు, గ్రామస్థులు కనీసం చూసేందుకు కూడా రాకపోవడంతో.. జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ధైర్యంగా ముందుకొచ్చారు. పీపీఈ కిట్ ధరించి తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి దహన సంస్కారాలు పూర్తి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇదీ చదవండి:lockdown relaxation: న్యాయవాదులకు మినహాయింపు సమయం పెంపు