పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీకి చెందిన వరుణ్ కుమార్‌కు సూర్యాపేటకు చెందిన అమ్మాయికి సాయిరాం గార్డెన్స్‌లో కొద్ది సమయంలో పెళ్లి జరిగేది. అయితే ఆకస్మికంగా మండపానికి పోలీసులు వచ్చి వరుడిని అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న కేసులో అతన్ని అరెస్టు చేశారు.
వరుణ్‌కుమార్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు. అయితే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ శుభకార్యంలో ముషీరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఏడాది కాలంగా ఇద్దరి మధ్య చాటింగ్‌లు, వీడియోకాల్స్ తరచూ మాట్లాడుకున్నారు.