ఉన్నత చదువులు చదివి.. అమెరికాలో స్థిరపడింది ఆ యువతి.. కోటి ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టేందుకు స్వదేశానికి వచ్చిన ఆమెపై మహమ్మారి పగబట్టింది. కొవిడ్‌ను జయించినా.. అనంతర సమస్యలు ఆమెను కబలించి ఆ ఇంట విషాదాన్ని నింపాయి. కరోనా అనంతర సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురై యువతి మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది.
Corona: కొవిడ్ అనంతర సమస్యలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
కరోనా ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. కోటి ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టేందుకు స్వదేశానికి వచ్చిన ఆమెపై మహమ్మారి పగబట్టింది. రూ.50 లక్షల ఖర్చు చేసినా... ప్రాణాలు మాత్రం మిగలలేదు. కొవిడ్ అనంతర సమస్యలతో ఆమె మృతి చెందింది.
స్థానిక ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన పెండ్యాల రవీందర్‌రెడ్డి కుమార్తె నరిష్మరెడ్డి(28) హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసి ఏడున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డారు. మే నెలాఖరులో పెళ్లి ఉండటంతో రెండు నెలల కిందటే అమెరికా నుంచి వచ్చారు. పనిమీద చెన్నై వెళ్లి వచ్చిన అనంతరం కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ కొవిడ్ నుంచి కోలుకున్నారు. అనంతరం ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపటంతో తిరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. 40 రోజులకుపైగా మృత్యువుతో పోరాడి మంగళవారం రాత్రి ఆమె మృతి చెందారు. చికిత్స కోసం రూ.50 లక్షలకుపైగా ఖర్చు చేశామని.. అయినా ప్రాణం దక్కలేదని నరిష్మ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదీ చూడండి: Corona: రూ.80 లక్షలు ఖర్చు చేసినా.. కుటుంబంలో ముగ్గురు మృతి