పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెరాసకు కొండంత బలమని... వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
తెరాస కార్యకర్తలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచన భాజపా, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని... తెరాస రెబల్ అభ్యర్థులను తమ పార్టీలోకి ఆహ్వానించి గులాబీ ప్రత్యర్థులుగా నిలిపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. కాబట్టి టికెట్లు రాని వారు నిరుత్సాహానికి లోనుకాకుండా... పార్టీ టికెట్ ఇచ్చిన వారితో కలిసి వారి గెలుపునకు కృషి చేయాలని మంత్రి సూచించారు.