పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘనంగా బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. పవర్ హౌస్ కాలనీలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి, జగిత్యాల జిల్లా రీజినల్ ఆర్గనైజర్ మూల విజయరెడ్డి ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
గోదావరిఖనిలో బతుకమ్మ సంబురాలు - పెద్దపల్లి జిల్లా వార్తలు
తెలంగాణలోని పల్లెలు పూల వనంలా మారాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘనంగా బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు ఆడి పాడారు.

గోదావరిఖనిలో బతుకమ్మ సంబురాలు
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఈ ఉత్సవాలు నిర్వహించామని విజయరెడ్డి తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సంబురాలు జరుపుకున్నామన్నారు.
ఇదీ చదవండి:'భాజపా ఉచిత టీకా వాగ్దానం చట్టబద్ధమే'