నిజామాబాద్ జిల్లాలో అనవసరంగా రోడ్డెక్కుతున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపించారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతున్న వారి వాహనాలను సీజ్ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ 2,062 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ కార్తికేయ తెలిపారు. 1420 ద్విచక్ర వాహనాలు, 555 ఆటోలు, 87 ఫోర్ వీలర్ వాహనాలను సీజ్ చేశామన్నారు.
ఇష్టానుసారంగా రోడ్డెక్కితే వాహనాలు సీజ్ చేస్తాం - VEHICLES SEIZE IN NIZAMABAD
నిజామాబాద్ జిల్లాలో అవసరం లేకున్నా బయట తిరిగే వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లపై తిరుగుతున్న వారి వాహనాలను సీజ్ చేశారు.

పోలీసుల వాహనాల తనిఖీలు...ఆపై సీజ్
నిబంధనలను ఉల్లంఘించిన 66 మందిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకూడదని ఆయన సూచించారు.