తెలంగాణ

telangana

By

Published : Feb 6, 2020, 3:38 PM IST

ETV Bharat / state

టీఎన్జీవోస్ క్రీడలను ప్రారంభించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌ నగరంలోని కలెక్టరేట్ మైదానంలో టీఎన్జీవోస్ క్రీడలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఉద్యోగులు సమర్థంగా పనిచేయాలని మంత్రి సూచించారు.

tngos games started by minister vemula prashanth reddy
టీఎన్జీవోస్ క్రీడలను ప్రారంభించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయికి చేరడంలో అధికారులు, సిబ్బంది పాత్ర కీలకమని.. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ నగరంలో టీఎన్జీవోస్ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఉద్యోగులు సమర్థంగా పనిచేస్తేనే పథకాలు పేదలకు అందుతాయని.. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ విఠల్‌రావు, బోధన్‌ ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీఎన్జీవోస్ క్రీడలను ప్రారంభించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఇవీ చూడండి:రామప్ప చూడొచ్చు.. లక్నవరం మాత్రం వెళ్లలేము!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details