నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో రేషన్ సరుకులకు ఫోన్ నంబర్ లింక్ చేయడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఓటీపీ ఉంటేనే రేషన్ ఇస్తామనే నిబంధనలను ప్రభుత్వం పెట్టడంతో మొబైల్ లేని వారు పరేషాన్ అవుతున్నారు. ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేసేందుకు ఆధార్ కేంద్రాల వద్ద సాధారణ జనాలు బారులు తీరుతున్నారు. బోధన్‌లోని ఈ సేవ కేంద్రం వద్ద పోలీసులు ప్రజలను కంట్రోల్ చేస్తున్నారు.
రేషన్‌కు ఓటీపీ కష్టాలు.. ఎప్పట్లాగే ఇవ్వాలంటున్న సామాన్యులు - nijamabad diastrict latest news
తెల్ల రేషన్ కార్డులకు ఫోన్ నంబర్ లింక్ చేసి ఓటీపీ తప్పనిసరి నిబంధనలు పెట్టడంతో రేషన్ లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేసేందుకు ఈ సేవ, ఆధార్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. వేలి ముద్రల ఆధారంగా పాత పద్ధతిలోనే రేషన్ ఇచ్చి తమ కష్టాలను గట్టెంకించాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.

పాత పద్ధతిలోనే రేషన్ ఇవ్వాలని కోరుతున్న సాధారణ జనం
ఇన్నాళ్లు రేషన్ షాప్‌కి వెళితే వేలి ముద్రలు పెట్టి సరుకులు తెచ్చుకునేవారు. ఇప్పుడు రేషన్ పొందాలంటే ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఏ ఫోన్ నంబర్ అయితే ఆధార్ కార్డుకు జతపరిచామో.. ఆ నంబరుకు ఓటీపీ రావడంతో బియ్యం ఇస్తున్నారు. లేని వారు ఆధార్‌కు ఫోన్ నంబర్ జత చేసుకోవాలి. వేలిముద్రల ఆధారంగా పాత పద్ధతిలోనే రేషన్ ఇచ్చి తమ కష్టాలను గట్టెంకించాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి:గాజీపూర్ సరిహద్దులో మేకులు తొలగింపు.. కానీ!