తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్వసభ్య సమావేశం: హామీలు నెరవేర్చడం లేదని సర్పంచుల నిలదీత - Nizamabad district latest news

నిజామాబాద్ జిల్లా బోధన్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సగంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సర్పంచులు కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని అధికారులపై మండిపడ్డారు.

Nizamabad District Bodhan Mandal Parishad Plenary Session was held
హామీలు నెరవేర్చడంలేదని సర్పంచుల నిలదీత

By

Published : Mar 5, 2021, 5:26 PM IST

అసంపూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చెేయాలని నిజామాబాద్ జిల్లా బోధన్ మండల సర్పంచులు కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని అధికారులను నిలదీశారు. మండల సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పంచాయతీ పరిధిలో జరగాల్సిన అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయన్నారు. ఆర్అండ్​బీ అధికారుల వ్యవహారశైలి మార్చుకోవాలని సూచించారు. రైతు బీమా చెక్కులు నేరుగా లబ్ధిదారులకు ఇవ్వకుండా సర్పంచులు, ఎంపీటీసీల అనుమతితో ఇవ్వాలని కోరారు.

బెక్​నెల్లి రోడ్డు పనులు జరుగుతుండటం వల్ల విద్యుత్​ తీగలు ఆర్టీసీ బస్సులకు తగులుతున్నాయని తెలిపారు. దాని వల్ల బస్సులు రాకపోవడంతో విద్యార్థులు కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళ్తున్నారని చెప్పారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:'భయపెట్టాలని చూస్తే... పట్టభద్రులు గుణపాఠం చెప్తారు'

ABOUT THE AUTHOR

...view details