తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసలో చేరిన నిజామాబాద్‌ 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ - nizamabad 6th division bjp corporator join in trs party

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల వల్లే ఇతర పార్టీ సభ్యులు తెరాసలో చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రం 6వ డివిజన్​కు చెందిన భాజపా కార్పొరేటర్​ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

nizamabad-6th-division-bjp-corporator-join-in-trs-party
తెరాసలో చేరిన నిజామాబాద్‌ 6వ డివిజన్‌ కార్పోరేటర్‌

By

Published : Sep 24, 2020, 1:13 PM IST

నిజామాబాద్​ జిల్లాలోని 6వ డివిజన్‌కు చెందిన భాజపా కార్పొరేటర్ ఉమారాణి తెరాసలో చేరారు. హైదరాబాద్‌లోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె గులాబి కండువా కప్పుకున్నారు. వారిని మంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వల్లే... ప్రజలకు మంచి తెరాసలోనే జరుగుతుందనే ఉద్దేశంతో పార్టీలోకి వచ్చారని వేముల తెలిపారు. నిజామాబాద్‌ అభివృద్ధికై ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు ముగ్గురు కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పోచారం సురేందర్ రెడ్డి, ధరంపురి కార్పొరేటర్ సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి తెరాసలోకి వస్తున్నారు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details