తెలంగాణ

telangana

ETV Bharat / state

తక్షణం విధుల్లో చేరండి: అదనపు కమాండెంట్ - 50 STAFF WITHOUT PERMISION

అనుమతి లేకుండా గైర్హాజరవుతున్న సిబ్బందిపై ఏడో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు.

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వీరికి బందోబస్తు విధులు అప్పగించాం : సత్య శ్రీనివాస రావు

By

Published : Mar 27, 2019, 7:39 PM IST

సిబ్బంది తక్షణమే విధుల్లో చేరాలి : అడిషనల్ కమాండెంట్
నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని టీఎస్ఎస్పీ ఏడో బెటాలియన్​లో పని చేస్తున్న 50 మంది సిబ్బందిపై అదనపు కమాండెంట్ సత్య శ్రీనివాస రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పోటీ పరీక్షలకుసన్నద్ధమవుతున్న ఈ సిబ్బంది.. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారని ఆగ్రహించారు. వెంటనే వారు విధుల్లో చేరాలని హెచ్చరించారు. వీరికి ఇప్పటికే సమాచారం ఇచ్చామని తెలిపారు.

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వీరికి బందోబస్తు విధులు అప్పగించారు. ఏప్రిల్1 లోగా విధులకు హాజరైతే ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోమన్నారు. లేని పక్షంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘన ప్రకారం తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details