నిజామాబాద్ నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి నగర మేయర్ నీతూ కిరణ్ పండ్లు పంపిణీ చేశారు. గతేడాది నుంచి కరోనా విజృంభిస్తున్నా, లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజలందరు ఇళ్లకే పరిమితమైనా.. ఆశా వర్కర్లు, నర్సులు, వైద్యులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారన్నారు.
వైద్య సిబ్బందికి పండ్లు అందించిన నగర మేయర్ - Nizamabad latewst news
నిజామాబాద్ నగరంలోని పలు అర్బన్ సెంటర్లలో పని చేస్తున్న ఆరోగ్య సిబ్బందికి నగర మేయర్ పండ్లు అందించారు. కష్ట కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయం చేస్తున్నారని వారి సేవని కొనియాడారు.

nizamabad mayer distributesd fruties
అలాంటి వారి కృషికి ఎంత చేసినా తక్కువేనని మేయర్ అభిప్రాయపడ్డారు. వారి ఆరోగ్యం బాగుండాలనే 150 మందికి పండ్లు పంచామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, నర్సులు తదితరులు పేర్కొన్నారు.