ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లకు కూడా బాధ్యత ఉందని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. లాక్డౌన్ వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ధాన్యం ఆలస్యంగా కొనడం, ఎండల తీవ్రత కారణంగా అన్నదాతలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే ప్రభుత్వంతో తేల్చుకోవాలని.. రైతులను తరుగు పేరుతో వేధించడం సరికాదన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపడంలో పభుత్వం కొంత వెనుకబడిందని.. కొద్ది రోజుల ముందుగానే రైళ్లు ఏర్పాటు చేసి ఉంటే వలస కూలీలు ఇబ్బందులు పడేవారు కాదన్నారు. మద్యం షాపుల వద్ద లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని చెప్పుకొచ్చారు. తమ వంతుగా వలస కూలీలకు నిత్యం ఆహారం అందించామని పేర్కొన్నారు.
'ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లకు కూడా బాధ్యత ఉంది' - ధాన్యం కొనుగోళ్లు
ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లకు కూడా బాధ్యత ఉందని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఏమైనా సమస్యలు మిల్లర్లు ప్రభుత్వంతో తేల్చుకోవాలని... అన్నదాతలను తరుగుతో వేధించడం సరికాదన్నారు.

'ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లకు కూడా బాధ్యత ఉంది'