నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో పంచాయతీ కార్మికురాలి మృతికి నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వీరన్నగుట్ట గ్రామం నుంచి వీరన్నగుట్ట తండా కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడింది. పంచాయతీ నిధులు సరిపోకపోగ కార్మికులను విధుల నుంచి తొలగించిన ఘటనకు నిరసనగా మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఇంటికి వచ్చిన బుచ్చమ్మ అనే కార్మికురాలు బీపీ ఎక్కువ కావడం వల్ల మరణించింది. ఆమె మృతికి సర్పంచ్ బాధ్యత వహిస్తూ.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
కార్మికురాలి మృతికి నిరసనగా ధర్నా
నిజామాబాద్ జిల్లా వీరన్నగుట్టలో పంచాయతీ కార్మికురాలి మృతికి నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కార్మికురాలి మృతికి నిరసనగా ధర్నా