నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలోని పెద్ద చెరువులో మొసలి కలకలం రేపుతోంది. ఊరు పక్కనే ఉన్న పెద్ద చెరువులో మొసలి కనపడటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పక్కనే పంట పొలాలు కూడా ఉన్నాయి. మొసలి కనిపించడం వల్ల పనులు చేసుకునేందుకు భయపడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.
రెంజర్ల పెద్ద చెరువులో మొసలి కలకలం - నిజామాబాద్ జిల్లా రెంజర్ల గ్రామ పెద్ద చెరువులో మొసలి కలకలం
నిజామాబాద్ జిల్లాలోని రెంజర్ల గ్రామ పెద్ద చెరువులో మొసలి కలకలం సృష్టిస్తోంది. ఊరు పక్కనే చెరువు, ఆ పక్కనే పంట పొలాలు ఉండటం వల్ల గ్రామస్థులతో పాటు రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

రెంజర్ల పెద్ద చెరువులో మొసలి కలకలం
ఒకరి ద్వారా ఒకరు విషయం తెలుసుకున్న గ్రామస్థులు తండోపతండాలుగా వెళ్లి మొసలిని చూశారు. వారి కళ్ల ముందే అది బురద నీటిలోకి జారుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మొసలిని పట్టుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.