తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో పార్టీ కార్యాలయం, కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ - CM KCR in public meeting

kcr nizamabad tour ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనంతో పాటు జిల్లా తెరాస కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు.

CM KCR TOUR IN NIZAMABAD DISTRICT
నేడు నిజామాబాద్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

By

Published : Sep 5, 2022, 7:10 AM IST

Updated : Sep 5, 2022, 4:07 PM IST

kcr nizamabad tour: నిజామాబాద్‌ సమీకృత కలెక్టరేట్‌ భవనం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టరేట్​తో పాటు తెరాస జిల్లా పార్టీ కార్యాలయాన్నీ సీఎం ప్రారంభించారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో సువిశాల విస్తీర్ణంలో కలెక్టరేట్‌ నిర్మించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 కోట్ల వ్యయంతో భవనం రూపుదిద్దుకుంది. కలెక్టరేట్ ప్రారంభంతో బైపాస్ రోడ్డు ప్రాంతం పచ్చని హారంగా మారింది. ఐదు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. కొత్త కలెక్టరేట్‌తో ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.

కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి గిరిరాజ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొననున్నారు. సభకు సంబంధించి పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు ఏర్పాట్లు పర్యవేక్షించారు. భారీ స్థాయిలో జన సమీకరణ చేసి విజయవంతం చేసేలా ప్రణాళికలు అమలుచేస్తున్నారు. ముఖ్యమంత్రి సభ జిల్లా తెరాస శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేలా ఉంటుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

మంత్రివర్గం, సీఎల్పీ స‌మావేశాల త‌ర్వాత పాల్గొంటున్న స‌భ కావడంతో ముఖ్యమంత్రి ప్రసంగంపై ఆసక్తి నెల‌కొంది. కేసీఆర్‌ రావడంతో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నిజామాబాద్ గులాబీమయంగా మారింది.

ఇవీ చూడండి:

Last Updated : Sep 5, 2022, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details