Maha Jan Sampark Abhiyan program in Nizamabad : కరోనా సమయంలో వేగంగా వ్యాక్సిన్ కనుగొనడంలో.. ప్రపంచంలోనే భారత్ మొదటిదని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. అమెరికా కంటే అతివేగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశంలోనే జరిగిందని వివరించారు. ఈ క్రమంలోనే 3 కోట్ల 50 లక్షల ఇల్లు పేదలకు మోదీ సర్కార్ కట్టించి ఇచ్చిందని తెలిపారు. కానీ రాష్ట్రంలో పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తామని వాగ్దానం చేసిన కేసీఆర్.. గెలిచిన తర్వాత దానిని తుంగలో తొక్కారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Arvind Comments on BRS Government : ఇందులో భాగంగానే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సాయంతో తొమ్మిదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధి.. అంతకు ముందు 60 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని అర్వింద్ వివరించారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల 72 లక్షల మరుగుదొడ్లను బీజేపీ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. కానీ రాష్ట్రంలో మరుగుదొడ్లను నిర్మించకుండానే.. పూర్తి చేసినట్టు చూపి ఎమ్మెల్యేలు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని అర్వింద్ విమర్శించారు.
- BJP Jan Sampark Abhiyan in TS : 'జన్ సంపర్క్ అభియాన్'.. అస్త్రంగా రాష్ట్ర బీజేపీ వ్యూహం
మరోవైపు కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో సీఎం కేసీఆర్ దోచుకున్నారని అర్వింద్ ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ వల్ల ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. దీని కింద 10 కోట్ల 74 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. ప్రతి ఏకరానికి రూ.35,000 వివిధ రూపాల్లో ప్రధాని మోదీ ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిందని అర్వింద్ వివరించారు.