శనివారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్‌లో కార్మికులపై పోలీసులు చేసిన లాఠీఛార్జికి నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపోను ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. బస్ డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొనగా.. డిపో ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా మిలియన్ మార్చ్ చేసుకుంటామని కార్మికులు వస్తే అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఎన్ని చేసిన కార్మికులు మిలియన్ మార్చ్ నిర్వహణలో విజయం సాధించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల తీరుకు నిరసన - tsrtc strike news
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. శనివారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్‌లో పోలీసులు దురుసుగా ప్రవర్తించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.

పోలీసుల తీరుకు నిరసన
నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన
ఇదీ చూడండి : 'కాంగ్రెస్ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు'