తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2020, 7:21 PM IST

ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

నిర్మల్ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ సందర్శించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

nirmal collector review on grain purchase centres
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. లక్ష్మణచాంద మండలంలోని పీచర గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, రాచాపూర్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. నిర్వాహకులకు, రైతులకు పలు సూచనలు చేశారు.

అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు రోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో మోహన్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:బండి సంజయ్​కు నగరంపై పూర్తి అవగాహన లేదు: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details