తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

నిర్మల్​ పట్టణంలో పలు మండలాలకు చెందిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్​ లబ్ధిదారులకు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. పేదప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి అన్నారు.

minister indrakaran reddy cheques distribution in nirmal district
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

By

Published : Jun 19, 2020, 5:03 PM IST

పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ పట్టణంలోని దివ్య గార్డెన్‌లో నిర్మల్‌ రూరల్‌, లక్ష్మణచాంద, సోన్‌, దిలావర్ పూర్, నర్సాపూర్ (జి) మండలాలకు చెందిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు.48 మంది లభ్దిదారులకు 29లక్షల 53వేల 480 రూపాయల విలువగల చెక్కులను అందజేశారు.

నిరుపేద ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలతో అండగా నిలుస్తోందని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయ లక్ష్మి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చూడండి: సిరిసిల్ల జిల్లాలో జలహితం పనులు ప్రారంభించిన కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details