స్వర్ణ ప్రాజెక్ట్ నిర్మించినప్పుడే లో-లెవల్ కాజ్ వే నిర్మించి ఉండాల్సిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వంతెన లేకపోవడం వల్ల జౌలి గ్రామప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో స్వర్ణ ప్రాజెక్టు వద్ద నిర్మించిన లో-లెవల్ కాజ్వేను మంత్రి ప్రారంభించారు.
నెరవేరిన దశాబ్ధాల కల... స్వర్ణ వాగుపై లో-లెవల్ కాజ్వే ప్రారంభం
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జౌలి గ్రామస్థుల దశాబ్దాల కల నెరవేరింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా స్వర్ణ ప్రాజెక్ట్ వద్ద రూ.90 లక్షల వ్యయంతో నిర్మించిన లో-లెవల్ కాజ్ వేను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
Low Level Cause way at Swarna Project
ఎన్నికల హామీ మేరకు గతేడాదిలో కాజ్ వే నిర్మాణానికి భూమి పూజ చేశామని... ఏడాదిలోనే నిర్మాణం పూర్తైందని తెలిపారు. వంతెన అందుబాటులోకి రావడం వల్ల రైతులకు, విద్యార్థులకు దూర భారం తగ్గుతుందని వివరించారు.
ఇదీ చూడండి:chada venkat reddy: సీఎం కేసీఆర్కు చాడ లేఖ