తెలంగాణ

telangana

ETV Bharat / state

శాసనమండలి ఎన్నికల్లో ఓటేసిన ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న అటవీ శాఖ మంత్రి

By

Published : Mar 22, 2019, 7:47 PM IST

ఓటు హక్కు వినియోగించుకున్న అటవీ శాఖ మంత్రి
శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి. నిర్మల్​ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబర్ 50లో ఇంద్రకరణ్ రెడ్డి ఓటు వేశారు. కరీంనగర్​-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు నిర్మల్​ జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి.

ABOUT THE AUTHOR

...view details