తెలంగాణ

telangana

ETV Bharat / state

బాసర సరస్వతీ ఆలయంలో భక్తుల రద్దీ - saraswathi

బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చి తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు.

బాసర సరస్వతీ ఆలయంలో భక్తుల రద్దీ

By

Published : Apr 24, 2019, 2:44 PM IST

బాసర సరస్వతీ ఆలయంలో భక్తుల రద్దీ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారి దర్శనానికి ఒక్కరోజు ముందే బాసర చేరుకున్న భక్తులతో ఆలయ వసతి గృహాలతో పాటు ప్రైవేటు లాడ్జీలు నిండిపోయాయి. వేకువజామున 4గంటలకు అమ్మవారికి అభిషేకం, అలంకరణ నిర్వహించిన వేదపండితులు వేద మంత్రోచ్ఛరణలతో మహా నివేదన మంగళ హారతి నిర్వహించారు. అనంతరం భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.

తెలంగాణతో పాటు ఆంధ్ర, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా తరలిరావడం వల్ల ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

ఇవీ చూడండి: కొత్త ఆవిష్కరణలకు ఇంజనీరింగ్​ విద్యార్థులు శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details