ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ టీకాల పంపిణీకి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలుత వైద్యులు, వైద్యసిబ్బందికి టీకాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం 11 కేంద్రాల ఎంపిక చేసి ప్రణాళిక రూపొందించింది. టీకా వేసుకోవడం ద్వారా 80శాతం వ్యాధి నిరోదకశక్తి పెరుగుతుందనే అభిప్రాయం వైద్యుల్లో వ్యక్తమవుతున్నప్పటికీ... కరోనా నియంత్రణ జాగ్రతలు పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి 11 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 11 కేంద్రాల ద్వారా వైద్య సిబ్బందికి టీకాలు ఇవ్వనున్నారు. టీకా వేసుకోవడం ద్వారా 80 శాతం వ్యాధి నిరోదక శక్తి పెరుగుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మూడు కేంద్రాల చొప్పున, మంచిర్యాల జిల్లాలో రెండు కేంద్రాల ద్వారా టీకాలు ఇవ్వనున్నారు. ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున శనివారం 330 మంది వైద్యసిబ్బంది టీకా ఇవ్వనున్నారు. ఇప్పటికే 21,735 మంది పేర్లు నమోదు చేసుకోగా... 4,450 మందికి సరిపడే టీకాలు కేంద్రాలకు చేరుకున్నాయి. సోమవారం నాటికల్లా మిగిలిన టీకాలు వస్తాయని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో టీకా పంపిణీ ఏర్పాట్లు
TAGGED:
nirmal