తెలంగాణ

telangana

ETV Bharat / state

'పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి' - కలెక్టర్​ హరిచందన తాజా వార్తలు

నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్​ కార్యాలయం నుంచి అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్​ హరిచందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

Rural nature parks and construction of farmer platforms should be completed soon
'పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి'

By

Published : Aug 27, 2020, 11:36 AM IST

జిల్లాలో పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్​లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రకృతి వనాల ఏర్పాటుకు జిల్లాలోని ప్రభుత్వ భూములను గుర్తించి.. రికార్డుల్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల్లో సమస్యలు ఉన్న భూములకు సంబంధించి గ్రామస్థులతో సమావేశం నిర్వహించి.. సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

రైతు వేదికల నిర్మాణ పనులు మొదలు కానీ చోట త్వరగా మొదలుపెట్టాలని అధికారులకు సూచించారు. అందరూ కలిసి ఒక టీమ్​లాగా పని చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో అడిషనల్ కలెక్టర్ చంద్ర రెడ్డి, డీఆర్​డీవో కాళిందిని, ఆర్​డీవో శ్రీనివాసులు, డీపీవో మురళి, ఉద్యాన వన శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ అధికారులు గంగారెడ్డి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి:నిజామాబాద్‌లో 3 మొక్కలు నాటిన కలెక్టర్‌

ABOUT THE AUTHOR

...view details