తెలంగాణ

telangana

ETV Bharat / state

'మొక్కల సంరక్షణా బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలి '

ప్రభుత్వ పిలుపు మేరకు పల్లె ప్రకృతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు నారాయణపేట కలెక్టర్ హరిచందన శ్రీకారం చుట్టారు. మొక్కలు నాటి వాటి సంరక్షణా బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని పలు గ్రామాల సర్పంచ్​లకు ఆమె సూచించారు.

'గ్రామ ప్రజలు సేదతీరేందుకు ప్రకృతి వనాలు భేష్'
'గ్రామ ప్రజలు సేదతీరేందుకు ప్రకృతి వనాలు భేష్'

By

Published : Jul 27, 2020, 9:58 PM IST

నారాయణపేట జిల్లాలో పల్లె ప్రకృతి వనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దన్వాడ, నారాయణపేట మండలం ఎక్లాస్​పూర్ గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిచందన హాజరయ్యారు. పల్లె ప్రకృతి వనంలో భాగంగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ హరిచందన కోరారు. మొక్కల సంరక్షణా బాధ్యతలనూ సమర్థంగా చేపట్టాలని ఆయా గ్రామ సర్పంచ్​లకు సూచించారు.

త్వరితగతిన పూర్తి చేయాలి..

గ్రామస్థులు సేదతీరేందుకు ప్రకృతి వనాలు ఎంతగానో ఉపయోగపడతాయని హరిచందన పేర్కొన్నారు. అందుకే మొక్కలు నాటే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కాళిందిని, ఎంపీడీవో సందీప్, అటవీ శాఖ అధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : కరోనాను ఓడిద్దాం.. ప్రాణాలతో నిలుద్దాం: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details