తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్స్య కారుల అభివృద్ధికి చేపల పెంపకంతో ప్రోత్సాహం: ఎమ్మెల్యే భాస్కరరావు - నల్గొండ జిల్లా తాజా వార్తలు

మత్స్య కారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. ఈ సందర్భంగా భాస్కరరావు, కలెక్టర్ ప్రశాంత్​ జీవన్​ పాటిల్.. ఆలగడప చెరువులో లక్షా 50 వేల చేప పిల్లలను వదిలారు.

miryalaguda mla and collector released fishes to aalagadapa lake
మత్స్య కారుల అభివృద్ధికి చేపల పెంపకంతో ప్రోత్సాహం: ఎమ్మెల్యే భాస్కరరావు

By

Published : Oct 9, 2020, 4:45 PM IST

మత్స్యకారుల అభివృద్ధికి పట్టణాలు, గ్రామాల్లోని చెరువుల్లో చేపల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. వర్షాలు సమృద్ధిగా పడటంతో గ్రామాల్లోని చెరువులు నిండుకుండలా మారాయని చెప్పారు. నల్గొండ జిల్లా ఆలగడప చెరువులో కలెక్టర్ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​, ఎమ్మెల్యే కలిసి 1,50,000 చేపపిల్లలను వదిలారు.

2020-21 సంవత్సరానికి గానూ మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే అన్ని చెరువులకి చేప పిల్లలను పంపిణీ చేస్తుందని భాస్కరరావు తెలిపారు. మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో గంగ పుత్రులకు చేయూతనిస్తూ ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా సీఎం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చింతల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పంటల కొనుగోలుపై రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details