నల్గొండ జిల్లా మునుగోడు మండలం దుబ్బాకాల్వకు చెందిన దండు యాదయ్యకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు రాకేశ్(11) మునుగోడలో ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. రాకేశ్ ఈ రోజు అమ్మనాన్నలతో పొలానికి వెళ్లాడు.
నీటి గుంటలో పడి బాలుడు మృతి - boy fall in Water pond in nlgonda district
పదకొండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి చనిపోయిన ఘటన నల్గొండ జిల్లా దుబ్బాకాల్వలో చోటుచేసుకుంది. బాబు మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

నీటి గుంటలో పడి బాలుడు మృతి
అక్కడే ఉన్న తన బాబాయి కొడుకుతో కలిసి ఊరి చివర ఉన్న నీటి గుంట వద్దకు వెళ్లారు. సరదగా నీటిలో ఆడుకునేందుకు అందులో దిగి పడిపోయాడు. వెంటనే అతని బాబాయి కొడుకు ఊళ్లోకి వెళ్లి చెప్పెలోగా రాకేశ్ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
నీటి గుంటలో పడి బాలుడు మృతి
TAGGED:
నీటి గుంటలో పడి బాలుడు మృతి