జీవనోపాధి కోసం అటవీ ఉత్పత్తులను సేకరించడానికి వెళ్లిన మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. రెండు రోజులుగా నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది తప్పిపోయిన మహిళ బంధువులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామానికి చెందిన కుంచమల్ల బాలమ్మ.. మంగళవారం మధ్యాహ్నం అడవిలోని కర్వేపాకు గింజల సేకరణకు వెళ్లి తప్పిపోయింది.
అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లి మహిళ అదృశ్యం - నల్లమల ఫారెస్ట్ లో మహిళ అదృశ్యం
రెండు రోజుల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలో తప్పిపోయిన మహిళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మాన్ ఆదేశాల మేరకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లి మహిళ అదృశ్యం
మహిళ తరఫు బంధువులు అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి ఒక్కో బృందంలో 10 మంది సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతాన్ని అంతా గాలిస్తున్నారు. తప్పిపోయిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శర్మాన్ గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: నర్సాపూర్ కేసులో నిందితులకు ఈనెల 24 వరకు రిమాండ్