నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఫరహాబాద్ చెక్‌పోస్ట్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లాపూర్, రోళ్ళబండ పెంటల సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో సుమారు 2 కిలోమీటర్ల వరకు మంటలు వ్యాపించాయి.
నల్లమల అడవుల్లో మరోసారి చెలరేగిన మంటలు - nallamala forest
నాగర్కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. సుమారు 2కిలోమీటర్ల వరకు మంటలు వ్యాపించగా... అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పివేశారు.

నల్లమల అడవుల్లో మరోసారి చెలరేగిన మంటలు
సమాచారం అందుకున్న అటవీ శాఖ అగ్నిమాపక సిబ్బంది రాత్రి 8 గంటల వరకు మంటలను ఆర్పివేశారు. రెండ్రోజుల క్రితం మల్లాపూర్ చెంచు పెంట సమీపంలో మంటలు చెలరేగి ఏడుగురు ఆదివాసీ చెంచులు తీవ్రంగా గాయపడిన విషయం మరువక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది.
నల్లమల అడవుల్లో మరోసారి చెలరేగిన మంటలు